టాలీవుడ్ చందమామ.. ఆల్చిప్పల్లాంటి తన కళ్లతో ఎంతోమందిని కట్టిపడేసింది. ఇండస్ట్రీకి వచ్చి దశాబ్దం గడిచినా.. చెక్కు చెదరని అందంతో దూసుకుపోతోంది. ఇప్పటికీ క్రేజీ ఆఫర్లతో కొత్త వచ్చే వారికి గట్టి పోటీనిస్తోంది.రీసెంట్‌గా తెలుగు ప్రేక్షకులను సీత చిత్రంతో పలకరించగా.. కోలీవుడ్ ప్రేక్షకులను కోమలి చిత్రంతో మెప్పించింది. తేజ దర్శకత్వంలో వచ్చిన సీత అంతగా విజయాన్ని సాధించకపోయినా.. కాజల్‌కు మాత్రం మంచి పేరే వచ్చింది. ఇక కోమలి చిత్రం తమిళ్‌లో మంచి విజయాన్నే సొంతం చేసుకుంది. తాజాగా పాల్గొన్న ఓ కార్యక్రమంలో కాజల్ కొన్ని ఆసక్తికర విషయాలను వెల్లడించింది.
#kajalaggarwal
#dolafzonkikahani
#comali
#DeepakTijori
#bollywood
#RandeepHooda